July 7, 2026
Explore
నాణ్యమైన ఆహారమే అందించాలి: రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు

నాణ్యమైన ఆహారమే అందించాలి: రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు

July 7, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:

రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు గంజమల దేవి మంగళవారం అన్నమయ్య జిల్లాలో విస్తృతంగా పర్యటించి అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాసంస్థలు, సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ చౌక దుకాణం, ఎంఎల్‌ఎస్ పాయింట్‌లను తనిఖీ చేశారు. వాల్మీకిపురం అంగన్‌వాడీ కేంద్రంలో కోడిగుడ్ల నాణ్యతను పరిశీలించి, ప్రమాణాలకు అనుగుణంగా లేని గుడ్లపై సిబ్బందిని హెచ్చరించారు.

గుర్రంకొండ రోడ్డులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో గడువు ముగిసిన వంటనూనె ప్యాకెట్లు గుర్తించి వెంటనే తొలగించాలని ఆదేశించారు. చింతపర్తి జడ్పీ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. కలికిరి, పీలేరు ప్రాంతాల్లోని గురుకులాలు, హాస్టళ్లు, ఎంఎల్‌ఎస్ పాయింట్, ప్రభుత్వ చౌక దుకాణాలను పరిశీలించి విద్యార్థులు, చిన్నారులకు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

Tags; Quality food must be provided: State Food Commission member