కడపముచ్చట్లు:
సమిష్టి కృషితోనే ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల లక్ష్యాలను చేరుకోవచ్చని ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లాల ఎయిడ్స్ నియంత్రణ మండలి క్లస్టర్ ప్రోగ్రామ్ అధికారి వేంపల్లి భాస్కర్ అన్నారు. మంగళవారం మదనపల్లె జిల్లా ఆసుపత్రిలోని ఏఆర్టీ కేంద్రంలో ఐసీటీసీ కౌన్సిలర్లు, ఏఆర్టీ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు.
మొబిలైజేషన్ ఆఫ్ ఎయిడ్స్ సురక్ష (ఎంఏఎస్) కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. హెచ్‌ఐవీ స్క్రీనింగ్‌లో 95 శాతం లక్ష్యం, చికిత్సలో 95 శాతం కవరేజ్, వైరల్ లోడ్ నియంత్రణలో 99 శాతం లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను తప్పనిసరిగా పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం జనచేతన స్వచ్ఛంద సంస్థ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు.
Tags: Controlling AIDS is possible only through collective effort.