July 7, 2026
Explore
టీటీడీ కల్యాణ మండపాన్ని అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి

టీటీడీ కల్యాణ మండపాన్ని అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి

July 7, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి–చిత్తూరు రోడ్డులోని టీటీడీ కల్యాణ మండపాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు మూడేళ్ల క్రితం రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించి ప్రారంభించిన ఈ ఏసీ కల్యాణ మండపం ఇప్పటికీ పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేటు ఫంక్షన్ హాళ్లలో శుభకార్యాలు నిర్వహించలేని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ మండపం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. టీటీడీ పాలకమండలి, సంబంధిత అధికారులు త్వరగా పునరుద్ధరణ చర్యలు చేపట్టి ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags: Request to make the TTD Kalyana Mandapam available for use.