మూడు ద్విచక్రవాహనాలు దగ్ధం
పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని మార్కెట్ యార్డులో హఠాత్తుగా మంటలు చెలరేగి మూడు ద్విచక్రవాహనాలు దగ్ధమైన సంఘటన మంగళవారం జరిగింది. పొలీసులు తెలిపిన మేరకు మార్కెట్ యార్డులో మధ్యాహ్నం అక్కడ ఉన్న చెత్తలో నుంచి మంటలు చెలరేగింది. దీనిని గమనించిన రైతులు, వ్యాపారులు పరుగులు తీశారు. ఈసమయంలో అక్కడ ఉన్న రెండు ద్విచక్రవాహనాలు పాక్షికంగా దగ్ధమైంది. అందులో గుట్టపల్లెకి చెందిన వెంకటేష్ వాహనం పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపకశాఖకు సమాచారం అందివ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.

Tags: Fire accident at the market yard