July 7, 2026
Explore
డాక్యూమెంట్‌ రైటర్ల రెండవ రోజు పెన్‌డౌన్‌ నిరసన

డాక్యూమెంట్‌ రైటర్ల రెండవ రోజు పెన్‌డౌన్‌ నిరసన

July 7, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

రిజిస్ట్రేషన్లశాఖను ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం జీవోఎంఎస్‌ నెంబరు 396 ను జారీ చేయడంపై పట్టణంలోని డాక్యూమెంట్‌ రైటర్లు, స్టాంప్‌ వెన్‌డార్లు , ఆపరేటర్లు రెండవ రోజైన మంగళవారం పెన్‌డౌన్‌ చేసి, నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. సంఘ ప్రతినిధులు రామమూర్తి, త్యాగరాజు ఆధ్వర్యంలో సబ్‌రిజిస్ట్రార్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం వెంటనే జీవోను ఉపసంహరించుకోవాలని లేకపోతే నిరసన కార్యక్రమాలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలోస పవన్‌కుమార్‌, సుబ్రమణ్యంబాబు, రవిచంద్రరాజు, రమణ, సాధిక్‌బాషా, హరికృష్ణ, నాగరాజ, శిల్ప, పురుషోత్తం, సుధీర్‌, క్రిష్ణప్ప, తదితరులు పాల్గొన్నారు.

Tags; Document writers’ ‘pen-down’ protest enters second day.