పుంగనూరుముచ్చట్లు:
మున్సిపాలిటి అధికారుల నిర్లక్షం ప్రజలకు శాపంగా మారుతోంది. పట్టణ సమీపంలోని మార్లపల్లె వద్ద ఉన్న కంపోస్ట్ యార్టులో గత 20 రోజులుగా చెత్త కాలిపోతోంది. దుర్గంధభరితమైన పొగ ఆప్రాంతం నుంచి మార్లపల్లె, సింగిరిగుంట, అరవపల్లె, కత్తార్లపల్లె, మాదనపల్లె, చింతలపల్లె గ్రామాలకు విస్తరించి కమ్మివేస్తోంది. దుర్వాసనతో వస్తున్న పొగను ప్రజలు పీల్చలేక ఆనారోగ్యం భారీన పడుతున్నారు. చెత్త నుండి సంపద తయారు చేస్తామని గొప్పలు పలికే మున్సిపల్ అధికారులు చెత్తను దగ్ధం చేసి చేతులు దులుపుకోవడం విమర్శలకు దారి తీస్తోంది.

Tags: Burning garbage causes illness among people.