July 7, 2026
Explore
సర్‌కు రండి…గడువు దగ్గరపడుతోంది

సర్‌కు రండి…గడువు దగ్గరపడుతోంది

July 7, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ఎస్‌ఐఆర్‌ (స్పెషల్‌ ఇన్‌టెన్సివ్‌ రివిజన్‌) కార్యక్రమానికి గడువు దగ్గరపడుతోందని , ప్రతి ఒక్కరు తమ ఓట్లు పరిశీలన చేసుకుని , నమోదు చేసుకునేందుకు తరలిరాలని మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అలీమ్‌బాషా కోరారు. మంగళవారం పార్టీ సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్దిన్‌షరీఫ్‌, జిల్లా మాజీ వక్ఫ్బోర్డు చైర్మన్‌ అమ్ము, కాపు సంఘ నాయకుడు కొండవీటి నరేష్‌ తో కలసి ఆయన పట్టణంలోని యూబికాంపౌండు, రహమత్‌నగర్‌, కుమ్మరవీధి, ఎంబిటి రోడ్డు, కొత్తపేట ప్రాంతాలలో ఎస్‌ఐఆర్‌ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. బిఎల్‌వోలు, బిఎల్‌ఏతో కలసి ఎన్యూమరేషన్‌ ఫారాలను పంపిణీ చేశారు. ఎప్పటికప్పుడు డిజిటలైజేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలీమ్‌బాషా మాట్లాడుతూ ఈనెల 14తో ఎస్‌ఐఆర్‌ కార్యక్రమం ముగుస్తుందన్నారు. ఓటర్లు అందరు ప్రస్తుత జాబితాలను పరిశీలించుకుని , డిజిటల్‌ చేయించాలని సూచించారు. ఓటు లేకపోతే సంక్షేమ పథకాలు కూడ తొలగిస్తారన్నది ప్రచారం సాగుతోందని, ఇలాంటి వాటికి చోటు ఇవ్వకుండ ఓటర్లు జాగ్రత్త పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌బాషా, కెఎస్‌ఏ నూరుల్లా, మాజీ కౌన్సిలర్‌ సాజిదాబేగం, జిమ్‌ఇర్ఫాన్‌, అజీజ్‌, రమణ, అస్లాంమురాధి, అయాజ్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags: Please come, Sir… the deadline is approaching.