July 6, 2026
Explore
వివాహిత మృతి

వివాహిత మృతి

July 6, 2026 | Andhra Pradesh

బద్వేల్ ముచ్చట్లు:


బగ్గు మొన్న ఐత్రం పేట గ్రామం బద్వేల్ నియోజకవర్గం బి కోడూరు మండలంలోని ఐత్రం పేట గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం వివాహిత సిద్ధు అనూష (26) ఆత్మ హత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివ రాల ప్రకారం ఐత్రం పేటకు చెందిన సిద్దు రామసుబ్బారెడ్డి, నారాయణమ్మ ఏకైక కుమార్తె అనూషకు ఒంటిమిట్టకు చెందిన, హైదరాబా ద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న పేరూరు సాయినాథెడ్డితో 9 నెలల కిందట వివాహం చేశారు. వివాహం అనంతరం దంపతులు రెండు నెలలపాటు హైదరాబాద్ లో కాపురం చేశారు. ఆ తర్వాత అదనపు వరకట్నం తేవాలంటూ భర్త, అత్తమామలు ఆమెను రోజూ మానసికంగా, శారీరకంగా తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనూష
రెండు నెలలుగా పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం తల్లిదండ్రులు బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె మనస్తాపంతో విష ద్రావకం తాగి ఆత్మహత్యకు యత్నించింది. కాసేపటికి ఇంటికొచ్చిన ఆమె అమ్మమ్మ గుర్తించి అనూష తమ్ముడైన శ్రీనాధ్ ను పిలిచి విషయం చెప్పింది. అప్పటికే స్పృహకోల్పోవడంతో తండ్రి రామసుబ్బారెడ్డి, తండ్రి, తమ్ముడు ఇద్దరూ బైక్ పై పోరు మామిళ్లలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషయంపై తల్లి దండ్రులు, బంధువులు బి.కోడూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సూర్యనారాయణరెడ్డి చెప్పారు.

Tags: Married woman dies