July 6, 2026
Explore
విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి

విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి

July 6, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం వారి భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా పదవి విరమణ చేసి సంఘ సభ్యులుగా చేరిన రమణారెడ్డి, ప్రమీలమ్మ, మురళికృష్ణ లకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా చెంగారెడ్డి మాట్లాడుతూ ఐదుడిఆర్‌లను మంజూరు చేయాలన్నారు. 12వ పీఆర్‌సిని నియమించి, ఐఆర్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంఘ నేతలు రామకృష్ణారెడ్డి, సుబ్రమణ్యం, మునస్వామివెహోదలియార్‌,ద్వారకమ్మ, గంగులమ్మ, రెడ్డికుమారి, లీలావతమ్మ, నారాయణరెడ్డి, రమేష్‌బాబు, కేశవరెడ్డి, ఎం.రమేష్‌బాబు, ఈశ్వర్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: Arrears of retired employees must be paid.