పుంగనూరుముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఈనెల 13న జరిగే వాల్మీకుల సభ , ర్యాలీని జయప్రదం చేయాలని స్థానిక వాల్మీకి సంఘ నాయకులు అద్దాలనాగరాజ, నరసింహులు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక వాల్మీకి విగ్రహం వద్ద కరపత్రాలు , పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా అద్దాలనాగరాజ మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని వాల్మీకి కుటుంబ సభ్యులందరు ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు సురేష్‌బాబు, గంపల గంగరాజు, రాజశేఖర్, అమరనాథ్, రెడ్డెప్ప, శ్రీనివాసులు, టైలర్ రెడ్డెప్ప, రాములు, రమణ, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Tags: Make the Valmiki meeting on the 13th a grand success.