తిరుపతి ముచ్చట్లు:
- ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న టాస్క్ ఫోర్స్ ఎర్రచందనం అక్రమ రవాణాకు చెందిన పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న కేరళ కు చెందిన నాసర్ కెఎన్ ఎలియాస్ నాసర్ భాయ్ (53) పై టాస్క్ ఫోర్స్ అధికారులు పీడీ యాక్ట్ అమలు చేశారు. టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు ప్రత్యేక కార్యాచరణ అమలులో భాగంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ.శ్రీనివాస్ అద్వర్యంలో ఎఎస్పీ జె. కులశేఖర్ మార్గ నిర్దేశకత్వంలో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధించడమే కాకుండా, ఎక్కువ కేసుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా వృత్తిగా చేసుకుని, ముఠాగా ఏర్పడి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్ట్ లు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కేరళ కు చెందిన నాసర్ కెఎన్ ఎలియాస్ నాసర్ భాయ్ తమిళనాడు లోని కోయంబత్తూరు జిల్లా మెట్టుపాలయంలో ఉంటూ ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
- ఇతనిపై పీడీ యాక్ట్ అమలుకు టాస్క్ ఫోర్స్ సిఫారసు చేసింది. ఈ మేరకు తిరుపతి జిల్లా కలెక్టరు, జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ , ఇతనిపై పీడీ యాక్ట్ అమలుకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇతను ఎర్రచందనం కొల్లగొట్టడుతూ, వన్య మృగాల చట్టాలను ఉల్లంఘించి నేరాలు చేస్తూ ప్రజాజీవనానికి అటంకం కలిగిస్తున్నట్లు గుర్తించారు. ఇతనిపై ఆరు ఎర్రచందనం కేసులు ఉన్నాయి. ఇతనిపై పీడీ యాక్ట్ అమలులో భాగంగా నిందితుడిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధకంలో భాగంగా పీడీ యాక్ట్ అమలు చేయడానికి వెనుకాడబోమని టాస్క్ ఫోర్సు ఎస్పీ హెచ్చరించారు. ఎర్రచందనం కేసుల్లో ఇప్పటికే అనేక మందికి శిక్షలు పడ్డాయని గుర్తు చేశారు. యువత ఎర్రచందనం అక్రమ రవాణాకు ప్రయత్నించి వారి భవిష్యత్తును పాడు చేసుకోవద్దని చెప్పారు. స్మగ్లర్లకు శిక్ష పడటంతో పాటు వారి ఆస్తులు కూడా జప్తు చేసుకో పడతాయని తెలియజేసారు.
Tags: PD Act invoked against red sandalwood accused.