పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని అమ్మిగానిపల్లె గ్రామంలో శనివారం అక్కదేవతలను గ్రామస్తులు మేళతాళల నడుమ వైభవంగా గ్రామ పొలిమేరలకు తీసుకెళ్లి పచ్చవేసి , పూజలు చేశారు. గ్రామస్తులు ప్రతియేటా వర్షాలు బాగా కురవాలని, పంటలు పండాలని, గ్రామాలు సుబిక్షంగా ఉండాలంటు అక్కదేవతలకు పూజలు చేసి, పచ్చవేయడం ఆనవాయితీ. గ్రామస్తులు అక్కదేవతలకు పూలు, గాజులు, పసుపు, కుంకుమ , నిమ్మకాయలు పెట్టి భక్తిశ్రద్దలతో పూజలు చేశారు. అమ్మవారికి చల్లముద్ద, చక్కర పొంగలి, పెట్టి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
Tags: Worship of the sister-deities in Ammiganipalle