పుంగనూరుముచ్చట్లు:
బ్రిటిష్ దొరలను ఎదిరించి ప్రాణాలు వదిలిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు సేవలు మరువలేనిదని బసవరాజ జూనియర్ కళాశాల అధ్యాపకులు కొనియాడారు. శనివారం కళాశాలలో అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అలాగే శుభారాం డిగ్రీ కళాశాలలో అల్లూరి జయంతి వేడుకలు నిర్వహించారు. అల్లూరి సీతారామరాజును ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు బాలరాజునాయక్, భవాని,దేవిక, చెంగయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.
Tags: Grand tributes to Alluri Sitarama Raju