July 4, 2026
Explore
SIR ప్రక్రియను గడువులోపు పూర్తి చేయాలి

SIR ప్రక్రియను గడువులోపు పూర్తి చేయాలి

July 4, 2026 | Andhra Pradesh

: ప్రత్యేక అధికారి సుబ్రహ్మణ్యం

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:

SIR కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లా ప్రత్యేక అధికారి, జిల్లా విద్యాశాఖాధికారి డా. సుబ్రహ్మణ్యం కలికిరి మండల MPDO కార్యాలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా బీఎల్ఓలతో సమావేశమై ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) పురోగతిని సమీక్షించారు. ఓటరు మ్యాపింగ్‌ను ఎలాంటి పొరపాట్లు లేకుండా ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని, ఈ నెల 14వ తేదీలోపు ప్రక్రియను ముగించాలని ఆదేశించారు. సమావేశంలో MPDO భానుమూర్తి, తహసీల్దార్ సయీద్ అహ్మద్ పాల్గొన్నారు.

Tags: The SIR process must be completed within the deadline.