తిరుమల ముచ్చట్లు:
దేవుడు మీద ఉన్న భక్తి కి….వయస్సు తో సంబంధం లేదు అని నిరూపించింది పండు ముసలి బామ్మ
….కాలినడకన తిరుమలకు 116 ఏళ్ల వృద్ధురాలు! ఆధునిక కాలంలో యువతకు కూడా కష్టంగా మారిన తిరుమల కొండను.. 116 ఏళ్ల వృద్ధురాలు కాలినడకన అధిరోహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కర్ణాటకకు చెందిన 116 ఏళ్ల వృద్ధురాలు శ్రీనివాసునిపై భక్తితో, కుటుంబ సభ్యుల సహాయంతో కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. వయసును లెక్కచేయకుండా ఆమె మెట్లు ఎక్కుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఆమె భక్తిని, మనోబలాన్ని ప్రశంసిస్తూ, అంతా శ్రీవారి మహిమేనని వ్యాఖ్యానిస్తున్నారు.
Tags: An elderly grandmother… walking to Tirumala.