July 4, 2026
Explore
వామ్మో ఇమే మాములు లేడి కాదు బాబోయ్….కిలాడి లేడి…

వామ్మో ఇమే మాములు లేడి కాదు బాబోయ్….కిలాడి లేడి…

July 4, 2026 | Andhra Pradesh

భర్తను చంపేసి.. ఇంట్లోని బాత్‌రూమ్‌ కింద పాతిపెట్టిన భార్య

ఉత్తర్‌ప్రదేశ్‌ముచ్చట్లు:

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణ ఘటన వెలుగుచూసింది. భర్త సురేంద్ర శర్మను హత్య చేసిన భార్య రూబీ శర్మ, అతని మృతదేహాన్ని ఇంటి బాత్‌రూమ్ నేల కింద పాతిపెట్టి 45 రోజుల పాటు కనిపించకుండా పోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. నిద్రమాత్రలు కలిపిన పాయసం ఇచ్చి, స్పృహ తప్పిన తర్వాత గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం బాత్‌రూమ్‌లో గుంత తవ్వి మృతదేహాన్ని పాతిపెట్టి సిమెంట్‌తో మూసివేసింది. మరో కేసు దర్యాప్తులో భాగంగా ఇంటికి వచ్చిన పోలీసులకు ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో విచారించగా అసలు విషయం బయటపడింది. బాత్‌రూమ్ నేలను తొలగించి మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు పోస్టుమార్టానికి పంపి, రూబీ శర్మను అదుపులోకి తీసుకున్నారు.

Tags: Oh boy, she’s no ordinary woman… she’s a real schemer.