మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె టౌన్‌లో ప్రేమ వివాహం చేసుకున్న యువజంట తమకు కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని తాలూకా పోలీసులను ఆశ్రయించింది. కోళ్లబైలు పంచాయతీ జగన్ కాలనీకి చెందిన ఆనంద్ (26), అదే ప్రాంతానికి చెందిన బీటెక్ విద్యార్థిని వైష్ణవి (20) గత ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నారు.
పెద్దలు అంగీకరించకపోవడంతో మదనపల్లె సమీపంలోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం తమకు ఎలాంటి హాని జరగకుండా రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఇరువర్గాల కుటుంబ సభ్యులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. యువజంట ఇద్దరూ మేజర్లు కావడంతో వారి నిర్ణయాన్ని గౌరవించాలని, చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని పెద్దలను హెచ్చరించారు.
అలాగే యువజంటకు పూర్తి రక్షణ కల్పిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.
Tags: Police protection for the couple in love; counseling for the elders.