July 4, 2026
Explore
రూ.2 కోట్ల అప్పులతో దివాలా పిటిషన్ దాఖలు చేసిన దంపతులు

రూ.2 కోట్ల అప్పులతో దివాలా పిటిషన్ దాఖలు చేసిన దంపతులు

July 4, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె పట్టణంలో వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్న దంపతులు సుమారు రూ.2 కోట్ల అప్పులు తీర్చలేక స్థానిక కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశమైంది.

నీరుగట్టువారిపల్లెకు చెందిన మునిశేఖర్ ‘విజయలక్ష్మి సిల్క్స్’, ఆయన భార్య రాణి ‘అశ్విని సిల్క్స్’ పేరుతో వస్త్ర దుకాణాలు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా వ్యాపారంలో తీవ్ర నష్టాలు రావడంతో దుకాణాల నిర్వహణ కష్టంగా మారింది.

వ్యాపార అవసరాల కోసం చేసిన భారీ అప్పులు, రుణదాతల నుంచి పెరిగిన ఒత్తిడి కారణంగా అప్పులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో శుక్రవారం మదనపల్లె అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో దివాలా పిటిషన్ (ఐపీ) దాఖలు చేశారు.

వ్యాపార నష్టాల కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని, అప్పులు తీర్చే స్థోమత లేకపోవడంతో చట్టపరమైన రక్షణ కోసం కోర్టును ఆశ్రయించినట్లు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ ఘటన స్థానిక వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Tags: Couple files bankruptcy petition with debts of ₹2 crore.