July 4, 2026
Explore
ప్రేమ వివాహం చేసుకున్న భార్యను కిడ్నాప్ చేశారంటూ యువకుడి ఫిర్యాదు

ప్రేమ వివాహం చేసుకున్న భార్యను కిడ్నాప్ చేశారంటూ యువకుడి ఫిర్యాదు

July 4, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లెలో ప్రేమ వివాహం చేసుకున్న తన భార్యను ఆమె తల్లిదండ్రులు, బంధువులు కలిసి బలవంతంగా తీసుకెళ్లారని రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్ తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి కథనం ప్రకారం, అదే గ్రామానికి చెందిన యువతితో ఐదేళ్లుగా ప్రేమలో ఉండి, పెద్దలు అంగీకరించకపోవడంతో జూన్ 12న బి.కొత్తకోటలో వివాహం చేసుకున్నారు. శుక్రవారం ఆమెను బలవంతంగా తీసుకెళ్లారని ఆరోపించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Tags: Young man complains that his wife, whom he married for love, has been kidnapped.