July 3, 2026
Explore
నిన్ను చంపేది ఒక్కటే.. పిచ్చి కుక్కని చంపేది కూడా ఒక్కటే

నిన్ను చంపేది ఒక్కటే.. పిచ్చి కుక్కని చంపేది కూడా ఒక్కటే

July 3, 2026 | Andhra Pradesh

మంత్రి నారా లోకేష్ ని అందుకునే స్థాయిలో నువ్వు లేవు

ప్రకాష్ రెడ్డి పై ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం

54 మందికి రూ.52 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం

నిద్రలో కూడా ప్రకాష్ రెడ్డికి పరిటాల రవి గుర్తుకొస్తున్నాడన్న సునీత

అనంతపురంముచ్చట్లు:

కారు బాంబు కేసులో 24 మందిని పొట్టన పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి లాంటివారికి మంత్రి నారా లోకేష్ గురించి మాట్లాడే స్థాయి ఏమాత్రం లేదని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గానికి చెందిన 54 మంది లబ్ధిదారులకు 52 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల టిడిపి నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే పరిటాల సునీతతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ పేదవారికి ఆరోగ్య విషయంలో ఏ కష్టం వచ్చినా… ఈ ప్రభుత్వం ఆదుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్య సమస్యలతో చికిత్సలు పొందిన వారికి ఆర్థికంగా సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం చేస్తున్నట్లు చెప్పారు. గడిచిన రెండేళ్లలో 11.55కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం చేసినట్లు తెలిపారు. అలాగే మంత్రి నారా లోకేష్ ముందుచూపుతో కార్యకర్తలకు చేసిన ఇన్సూరెన్స్ వలన ఇప్పటివరకు ఎంతోమందికి సాయం అందిందన్నారు. అనుకోకుండా వారు చనిపోతే కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయల సాయం అందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 2000 కోట్ల రూపాయల మేర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసినట్లు వివరించారు. మనం చేస్తున్న పనుల గురించి ప్రతి ఒక్కరు చర్చించుకునేలా నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అంతకుముందు ఎమ్మెల్యే సునీత తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను ఓపికగా విన్నారు. కొన్ని సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపించారు. మరికొన్నింటికి నిర్దేశిత సమయంలో పరిష్కారం అయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ, విద్యుత్ సమస్యల పరిష్కారం విషయంలో అధికారులు ప్రత్యేకంగా చొరవ చూపాలని ఆదేశించారు. ప్రజలను పదేపదే కార్యాలయాలు చుట్టూ తిప్పించుకోవద్దని సూచించారు.

ప్రకాష్ రెడ్డి నీ స్థాయి ఏంటో తెలుసుకో

తనపై హత్యాయత్నం చేశారంటూ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద ఎమ్మెల్యే పరిటాల సునీత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆయన్ని చంపేది ఒకటే రోడ్డు మీద పిచ్చి పట్టి తిరుగుతున్న కుక్కని చంపేది కూడా ఒక్కటేనంటూ మండిపడ్డారు. ప్రకాష్ రెడ్డి నడిరోడ్లో ఒంటరిగా ఉన్నా కూడా ఎవరూ పలకరించే పరిస్థితి కూడా ఉండదని… అలాంటప్పుడు ఆయన్ను చంపే అవసరం ఎవరికి ఉందని నిలదీశారు. వాహనాన్ని రాంగ్ రూట్లో తీసుకువచ్చి టిప్పర్ తగిలిందని ఒక కొత్త డ్రామాలాడుతున్నారన్నారు. ఆయన వాహనానికి ఏదైనా డామేజ్ జరిగి ఉంటే ఎందుకు దానికి సంబంధించిన ఫోటోలు బయట పెట్టడం లేదన్నారు. అనుకోకుండా అక్కడ రోడ్డు పనులు చేస్తున్న ఎస్.ఆర్ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన టిప్పర్ రావడంతో అది కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు తాను కలిసి చేయించామని ఒక కొత్త నాటకం ఆడుతున్నారని విమర్శలు చేశారు. పైగా నారా లోకేష్ గురించి ప్రకాష్ రెడ్డి మాట్లాడటం పట్ల ఎమ్మెల్యే సునీత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఆయన అహర్నిశలు కృషి చేస్తుంటే… ప్రకాష్ రెడ్డి ఇలాంటి వివాదాల్లోకి లాగుతున్నారన్నారు.

నారా లోకేష్ ఊహించుకునే స్థాయి కూడా ప్రకాష్ రెడ్డికి లేదని స్పష్టం చేశారు. హత్యలు చేసే సంస్కృతి మీదని.. గతంలో కారు బాంబు పెట్టి 24 మందిని పొట్టన పెట్టుకున్న చరిత్ర మీదేనన్నారు. మీ స్వగ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి ఆత్మహత్యకు కూడా మీరే కారణమని సునీత అన్నారు. పైగా ఆ యువకుని ఇంట్లో మహిళల గురించి నీచంగా మాట్లాడటం.. ప్రకాష్ రెడ్డి నీచ స్థాయికి నిదర్శనం అన్నారు. మీ ఇంట్లో కూడా భార్య, పిల్లలు, కూతురు, కోడలు ఉంటారని కనీసం వారైనా ఏమైనా అనుకుంటారనే కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. మహిళల గురించి ఇలా నీచంగా మాట్లాడే పద్ధతి ఇప్పటినుంచి అయినా మానుకోవాలన్నారు. మహిళల పసుపు కుంకుమ తుడిచే అలవాటు మీ కుటుంబానికి, మీ పార్టీ వారికే ఉందంటూ సునీత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పరిటాల రవి 100 మందిని చంపించాడంటూ పదేపదే ఆరోపణలు చేస్తున్నారని… అదే నిజమైతే గతంలో కాంగ్రెస్ పార్టీ, మీ గొడ్డలి పార్టీ ఉన్నప్పుడు ఎందుకు విచారణ చేపట్టి నిరూపించలేదని ప్రశ్నించారు. పరిటాల రవి చనిపోయి 21 ఏళ్లు గడిచినప్పటికీ కూడా నిద్రలో కూడా ప్రకాష్ రెడ్డికి ఆయన పేరు గుర్తుకొస్తోందన్నారు. పైగా తాను ఈ రెండేళ్లలో ఎవరినో చంపానంటూ ఆరోపణలు చేస్తున్నారని. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కనీసం ప్రకాష్ రెడ్డి మాట్లాడే మాటలను పక్కనున్న వారైనా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి స్థాయి మరిచి మాట్లాడుతుంటే ఆ పార్టీ వారు ఎలా సహిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికైనా కనీస జ్ఞానం, సంస్కారంతో మాట్లాడటం నేర్చుకోవాలని ఎమ్మెల్యే సునీత హితవు పలికారు.

Tags; There is only one way to kill you… just as there is only one way to kill a mad dog.