ఒక్కొక్కరికి రూ,15,000 జరిమానా…
హిందూపురం ముచ్చట్లు:
ఈ మేరకు సంచలన తీర్పు వెల్లడించిన హిందూపురం రెండవ అదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి ..
తప్పు చేసినవారు ఎప్పటికీ శిక్ష నుండి తప్పించుకోలేరు..
జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్,
శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన అక్రమ సంబంధం హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ హిందూపురం రెండవ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జ్ వెంకటేశ్వరరావు ఈ రోజు (03-07-2026) సంచలనాత్మక తీర్పు వెల్లడించారు.
వివరాలలోకి వెళితే, చిలమత్తూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎస్.సి. నెం.377/2018 కేసులో నిందితులైన ఫిరంగి శ్రీధర్ (A1), పాలేపల్లి లక్ష్మి (A2)లు కలిసి ఆంజనేయులను హత్య చేసినట్లు విచారణలో రుజువుకావడంతో, భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 302 రీడ్ విత్ 34 కింద ఇద్దరికీ యావజ్జీవ కఠిన కారాగార శిక్ష (Rigorous Imprisonment for Life)తో పాటు ఒక్కొక్కరికి రూ.15000 జరిమానా విధించారు.
అదేవిధంగా, నేరానికి సంబంధించిన సాక్ష్యాధారాలను నాశనం చేసినందుకు IPC సెక్షన్ 201 కింద ఇద్దరు నిందితులకు 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.15000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు ప్రకటించింది.
ఈ కేసులో సమగ్ర దర్యాప్తు నిర్వహించి, పకడ్బందీ సాక్ష్యాధారాలను సేకరించి న్యాయస్థానం ముందు సమర్పించడం ద్వారా నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి దర్యాప్తు అధికారి అయిన సిఐ ,టి. వెంకటేశ్వర్లు, కోర్ట్ మానిటరింగ్ సెల్ సీఐ ఇస్మాయిల్ , ఏపీపీ గోపాలకృష్ణ, ప్రాసిక్యూషన్ బృందం,, కోర్టు మానిటరింగ్ విభాగం లైసెన్ ఆఫీసర్ శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్ శ్రీరాములు మరియు చిలమత్తూరు పోలీస్ స్టేషన్ సిబ్బందిని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ అభినందించారు.నేరాలకు పాల్పడే వ్యక్తులు చట్టం నుంచి తప్పించుకోలేరని, తప్పు చేసిన వారికి తప్పకుండా శిక్ష పడుతుందని ఈ తీర్పు మరోసారి నిరూపించిందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.
Tags: Life imprisonment for two accused in illicit affair murder case