July 3, 2026
Explore
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు రెవెన్యూ, పోలీస్‌ షాక్‌

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు రెవెన్యూ, పోలీస్‌ షాక్‌

July 3, 2026 | Andhra Pradesh

విగ్రహ ఏర్పాటును అడ్డు

  • దళితుల వెహోర అలకించేదెవరు
  • ప్రాణత్యాగాలకు సిద్ధమౌతున్న దళితులు

పుంగనూరుముచ్చట్లు:

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయనివ్వకుండ రెవెన్యూ, పోలీసు సిబ్బంది వెళ్లి పనులను అడ్డుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీనిపై ఎస్సీ,ఎస్టీ , బీసీ, మైనార్టీల తో పాటు పలు మేదావి వర్గాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని నల్లూరుపల్లె గ్రామ సమీపంలోని పొరంబోకు స్థలంలో దళితులు డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటుకు 5 సెంట్ల స్థలంలో గత ఏడాది పనులు ప్రారంభించారు. ఆ సమయంలో కొంత మంది అడ్డుకోవడంతో రెవెన్యూ అధికారులు విగ్రహం ఏర్పాటు చేసుకోమని సర్వే చేసి అనుమతి ఇచ్చారు. గత ఆరు నెలలుగా దళిత నాయకులు విగ్రహ ఏర్పాటుకు భూమి చదును చేసి , పునాదులు వేసి సుమారు రూ.10 లక్షల రూపాయలు ఖర్చుచేశారు. ఇలా ఉండగా ఆస్థలంలో విగ్రహం ఏర్పాటు చేయరాదని రెవెన్యూ అధికారులు తిరిగి హుకుం జారీ చేశారు. ఖాతరు చేయని దళిత నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో రగిలిపోయిన రెవెన్యూ అధికారులు తమ తలారి నారాయణను, పోలీసులను బుధవారం పంపి పనులను అడ్డుకున్నారు. దీనిపై దళిత నాయకుడు శంకరప్ప శుక్రవారం మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ విగ్రహాలను గ్రామాల్లో ఏర్పాటు చేస్తే రెవెన్యూ , పోలీస్‌ వారు వచ్చి పనులను అడ్డుకోవడం బాధకరమని ఆరోపించారు. ఈ విషయమై ప్రాణత్యాగాలైన చేసి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతామని పట్టుబట్టారు. కాగా కోట్లాది రూపాయలు విలువ చేసే చెరువులు , కాలువలు, ప్రభుత్వ భూములు దురాక్రమణ జరుగుతున్న పట్టించుకోని రెవెన్యూ అధికారులు కేవల 5 సెంట్ల భూమిలో అంబేద్కర్‌ విగ్రహం నిర్మిస్తే నష్టం ఏమిటని , దీనిపై ఎందుకు రాద్దంతం చేస్తున్నారో ఎవరికి అంతుచిక్కడం లేదు. దీనిపై జిల్లా కలెక్టర్‌ తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకపోతే రెవెన్యూ అధికారులచే గ్రామాల్లో శాంతికి విఘాతం కలిగే అవకాశాలు ఉందని పలువురు అంటున్నారు.

Tags: Revenue and Police Departments Deal a Shock to Constitution Maker Ambedkar