July 3, 2026
Explore
4,5 తేదీల్లో ఎస్‌ఐఆర్‌ డిజిటలైజేషన్‌ క్యాంపు

4,5 తేదీల్లో ఎస్‌ఐఆర్‌ డిజిటలైజేషన్‌ క్యాంపు

July 3, 2026 | Andhra Pradesh

-డిఆర్‌వో చంద్రశేఖర్‌రెడ్డి

పుంగనూరుముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్‌ కార్యక్రమం త్వరగా పూర్తి చేయాలని , ఇందుకోసం 4, 5 తేదీలలో డిజిటలైజేషన్‌ ప్రత్యేక క్యాంపు నిర్వహిస్తున్నామని ఎలక్ట్రోల్‌ ఆఫీసర్‌ , డిఆర్‌వో చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన తహశీల్ధార్‌ కార్యాలయంలో తహశీల్ధార్‌ రాము, కమిషనర్‌ మధుసూదన్‌రెడ్డితో కలసి వివిధ పార్టీలకు చెందిన నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 78 శాతం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు చివరి రోజు వరకు ఉండకుండ తక్షణమే తమ ఎన్యూమరేషన్‌ ఫారాలు అందజేయాలన్నారు. బిఎల్‌వోలకు పనిభారం లేకుండ అవసరమైన వారికి అదనపు సిబ్బందిని కేటాయిస్తామన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్న తక్షణమే తమకు ఫిర్యాదు చేయాలన్నారు. ఈ విషయమై పార్టీలకు చెందిన నాయకులు తమ పరిధిలో ప్రజలకు అవగాహన కల్పించి ఎస్‌ఐఆర్‌ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు.

Tags: SIR Digitization Camp on the 4th and 5th