July 3, 2026
Explore
ఎస్‌ఐఆర్‌ ఓటర్ల డిజిటలైజేషన్‌లో తికమకలు

ఎస్‌ఐఆర్‌ ఓటర్ల డిజిటలైజేషన్‌లో తికమకలు

July 3, 2026 | Andhra Pradesh

-ఈసీ జాబితాలో ఒక పేరు….డిజిటల్‌ మరొక పేరు
-ముస్లిం ఓట్లు గల్లంతు చేస్తారేమో…
-తలపట్టుకుంటున్న బిఎల్‌వోలు

  • డీఆర్‌వోకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సిపి నేతలు

పుంగనూరుముచ్చట్లు:

ఎన్నికల కమిషన్‌ నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్‌ (స్పెషల్‌ ఇన్‌టెన్సివ్‌ రివిజన్‌) కార్యక్రమంలో ఓట్లు పరిశీలించి , డిజిటలైజేషన్‌ చేసే సమయంలో తికమకలకు గురౌతున్నామని వైఎస్సార్‌సిపి నాయకులు డీఆర్‌వో చంద్రశేఖర్‌రెడ్డికి శుక్రవారం ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఎన్‌ఎస్‌.పేటలో నివాసం ఉన్న డాక్టర్‌ బేగ్‌, కుటుంబ సభ్యులు ఎస్‌ఐఆర్‌లో నమోదుకు ప్రయత్నించారు. ఈ సమయంలో గతంలో 2002 ఎస్‌ఐఆర్‌ కార్యక్రమంలో డాక్టర్‌ బేగ్‌, అజ్ముతులబేగ్‌, గౌస్‌నవాబ్‌బేగ్‌మహమ్మద్‌ లు వెస్ట్గోదావరి జిల్లా కోవ్వురు నియోజకవర్గం (72) ఓటర్ల జాబితాలో క్రమ సంఖ్య 786, 787, 788 తో ఉన్నారు. ప్రస్తుతం 15 సంవత్సరాలుగా పుంగనూరులో నివాసం ఉండి, ఓటింగ్‌లో ఇక్కడ పాల్గొంటున్నారు. ఇలాంటి వాటిని బిఎల్‌వోలు పరిశీలించి డిజిటల్‌ లో నమోదు చేసేందుకు ప్రయత్నించగా డాక్టర్‌ బేగ్‌ కుటుంబ సభ్యుల క్రమ సంఖ్య నెంబరులో ముదునూరి వెంకట్రమణ పేరుతో రావడంతో వారి కుటుంబ సభ్యుల ఎస్‌ఐఆర్‌ కార్యక్రమం ఆగిపోయింది. దీంతో ఇబ్బందులకు గురైన ముస్లిం ఓటర్లు ఈసీ చూపిన జాబితాలో ఉన్న పేర్లు డిజిటల్‌ జాబితాలో ఎందుకు లేదంటు నిలధీశారు. బిఎల్‌వోలు ఈ సంఘటనతో అవాక్కయ్యారు. పేర్లు వస్తే మేము చేసేందుకు సిద్ధం. డిజిటల్‌ జాబితాలో డాక్టర్‌ బేగ్‌ రాలేదని తలపట్టుకుర్చున్నారు.

ఈఆర్‌వోకు ఫిర్యాదు…

ఇలాంటి సంఘటనలతో ఇబ్బందులు పడుతున్నామని మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అలీమ్‌బాషా, సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌ షరీఫ్‌, జిల్లా వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్‌ అమ్ము, డీఆర్‌వో చంద్రశేఖర్‌రెడ్డి కి విపులంగా వివరించారు. ఆయన ప్రయత్నించగా అదే మాదిరి పేర్లు మారి రావడంతో దీనిపై తక్షణం చర్యలు తీసుకుంటామని, ఆందోళన చెందవద్దని సూచించారు. కాగా ఈసీ జాబితాకు, డిజిటల్‌ జాబితాకు పొంతన లేకపోవడంతో ఎస్‌ఐఆర్‌ కార్యక్రమం సాఫిగా జరగడం లేదని , పథకం ప్రకారం ముస్లిం ఓట్లు గల్లంతు చేసేందుకు కుట్రలు జరుగుతోందని వైఎస్సార్‌సిపి నాయకులు ఆరోపించారు.

Tags: Confusion in SIR voter digitization