July 3, 2026
Explore
శ్రీగంగమ్మ ఆలయం ప్రారంభం

శ్రీగంగమ్మ ఆలయం ప్రారంభం

July 3, 2026 | Andhra Pradesh

-మూడురోజులు ప్రత్యేక పూజలు

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని చదళ్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీగంగమ్మ ఆలయంలో ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు శుక్రవారం వేదపండితులు, గ్రామస్తులు కలసి ప్రారంభించారు. ఈనెల 5న గంగమ్మ విగ్రహాన్ని శాస్త్రోక్తంగా వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రతిష్టించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే పూజా కార్యక్రమాల్లో ఆదివారం చివరి రోజు పూర్ణాహుతి, మహాకుంభాభిషేకం, పంచామృతాభిషేకం, అలంకరణ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి అత్యంత సుందరంగా గ్రామస్తులు కలసి నిర్మించిన గంగమ్మ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులుకావాలెనని కోరారు.

Tags: Inauguration of Sri Gangamma Temple