పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని బస్టాండులో వెలసియున్న శ్రీవిరూపాక్షి మారెమ్మకు శుక్రవారం రాహుకాల పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా ఉసిరికాయలు, నిమ్మకాయలు, పూలతో అలంకరించి పూజలు చేశారు. మహిళలు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి నెయ్యిదీపాలు పెట్టి, చల్లముద్ద నైవేద్యంతో మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
Tags: Special prayers for Sri Virupakshi Maremma