July 3, 2026
Explore
లారీ అదుపుతప్పి రోడ్డుమీదబోల్తా

లారీ అదుపుతప్పి రోడ్డుమీదబోల్తా

July 3, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా, రాయచోటిలోని పాత ఎస్పీ ఆఫీసు , రింగ్ రోడ్డు మార్గము నందు గల లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి మలుపు రోడ్డు వద్ద చిత్తూరు నుంచి కడప వైపు వెళ్తున్న తమిళనాడు సంబంధించిన లారీ అదుపుతప్పి రోడ్డుమీద పడిపోవడం జరిగినది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

ఈ రింగ్ రోడ్డు మార్గం నందు తరచుగా వాహనాలు అతివేగముగా ప్రయాణించడం వల్ల రోడ్డుపై అడ్డంగా పడినటువంటి ఈ లారీని ఢీ కొట్టి మరిన్ని ప్రమాదాలు జరిగే దానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కావున దయచేసి పోలీసు సిబ్బందికి తెలియజేయడo ఏమనగా వీలైనంత తొందరగా రోడ్డుపై అడ్డంగా పడి ఉన్న ఈ లారీని తొలగించవలసిందిగా తెలుపడమైనది.

Tags: Lorry loses control and overturns on the road.