July 2, 2026
Explore
మందుబాబులకు కౌన్సిలింగ్ – పట్టణ ఎస్సై కళ్యాణ్ కుమార్

మందుబాబులకు కౌన్సిలింగ్ – పట్టణ ఎస్సై కళ్యాణ్ కుమార్

July 2, 2026 | Andhra Pradesh

జోగులాంబ గద్వాల ముచ్చట్లు:

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌకు లో తేదీ 01.07.2026 నాడు రాత్రి సమయంలో ముగ్గురు వ్యక్తులు బహిరంగంగా మద్యం సేవిస్తూ ఉన్నారు అనే కథనానికి స్పందించారు గద్వాల పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్. ఈ సందర్భంగా కృష్ణవేణి చౌక్ లో బుధవారం రోజు రాత్రి బహిరంగంగా మందు సేవించిన వ్యక్తులను స్టేషన్ కి తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రధాన రోడ్డుపై మద్యం సేవించినట్లయితే చర్యలు తప్పవని కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. ఈ సందర్భంగా పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో ప్రధాన రోడ్లపై మద్యం సేవించినట్లయితే తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు.

Tags: Counseling for Alcohol Consumers – Town SI Kalyan Kumar