June 30, 2026
Explore
అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య

అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య

June 30, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడుతో కలిసి భర్తను భార్యే హత్యచేసిన అమానవీయ ఘటన మదనపల్లిలో మంగళవారం వెలుగు చూసింది. హత్య కేసులో నిందితుల అరెస్టు వివరాలను జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి మీడియాకు వెల్లడించారు. మండలంలోని నారమాకుల తండాకు చెందిన బుక్య చిన్న బుడ్డన్ననాయక్(36) భార్య రమీల(30) అదే ఊరికి చెందిన రెడ్డప్ప నాయక్(40) తో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయమై భర్త భార్యను ఇటీవల మందలించడంతో ఈ నెల18న రాత్రి రుబ్బు రాయితో రమీల ఇంట్లో నిద్రపోతున్న భర్తను తలపై మోది హత్య చేసింది.

Tags: Wife murders husband for standing in the way of her illicit affair.