అమరావతి ముచ్చట్లు:
ఏపీలో బీఎల్ఓగా విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తల కోసం ప్రభుత్వం పని వేళల్లో మార్పులు చేసింది. వీరు పనిచేసే కేంద్రాలు జూన్ 29 నుంచి జూలై 28 వరకు ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 3:00 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి. ఈ పని వేళల్లో మార్పు కేవలం ఎన్నికల విధుల్లో పాల్గొన్న అంగన్వాడీ వర్కర్స్ పని చేస్తున్న కేంద్రాలకు మాత్రమే వర్తిస్తుంది. అలాగే లబ్ధిదారులకు పౌష్టికాహార పంపిణీకి ఎలాంటి ఆటంకం ఉండకూడదని అధికారులను ఆదేశించారు.
Tags: Change in working hours of Anganwadi centers in AP