అమరావతిముచ్చట్లు:
భుజం కండరాల్లో గాయం తీవ్రంగా ఉంది
అధికారిక కార్యక్రమాలు ముగించుకుని వస్తానన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కొద్దిసేపటి క్రితం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. రెండు భుజాలను నిశితంగా పరీక్షించిన వైద్యులు రొటేటర్ కఫ్ తోపాటు భుజానికి సంబంధించిన రెండు కండరాల్లో గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. తక్షణం శస్త్ర చికిత్స అవసరమని సూచించారు. అయితే ముందుగా నిర్ణయించిన పాలనాపరమైన, అధికారిక కార్యక్రమాలు పూర్తి చేయాలని, ఆ తర్వాతే శస్త్ర చికిత్స చేయించుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు.
పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్ గాయం, రెండు భుజాలకి చెందిన కండరాలు పూర్తిగా చిట్లడంతో ఇబ్బందిపడుతున్న విషయం విదితమే.
Tags: Doctors have advised that Deputy CM Pawan Kalyan requires immediate surgery.