అమరావతిముచ్చట్లు:
ప్రభుత్వ సేవలు, ఆర్థిక కార్యకలాపాలకు అత్యంత కీలకమైన ఆధార్ కార్డును ఇకపై వాట్సాప్ ద్వారా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వ అధికారిక MyGov హెల్ప్‌డెస్క్ చాట్‌బాట్‌ను ఉపయోగించి, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, యాక్టివ్‌గా ఉన్న డిజిలాకర్ ఖాతా సహాయంతో సెకన్లలో ఆధార్‌ను PDF ఫార్మాట్‌లో పొందవచ్చు.
దీని కోసం 9013151515 నంబర్‌ను కాంటాక్ట్స్‌లో సేవ్ చేసుకుని, చాట్ ప్రారంభించి, ‘డిజిలాకర్ సర్వీసెస్’ ఆప్షన్ ఎంచుకుని, ఆధార్ నంబర్, OTP ఎంటర్ చేస్తే సరిపోతుంది.
ఈ సదుపాయం ద్వారా అదనపు యాప్‌లు అవసరం లేకుండానే ఆధార్‌ను సురక్షితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Tags: Do you know how to download your Aadhaar card via WhatsApp?