సంబేపల్లి ముచ్చట్లు:
సంబేపల్లి మండలం దుద్యాల –మోపురంపల్లి సరిహద్దు ప్రాంతంలో పేకాట ఆడుతున్న 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఐ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 11 సెల్‌ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Tags: Police raid gambling den; 11 arrested.