June 30, 2026
Explore
లక్కిరెడ్డిపల్లె ఎస్సీ హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్

లక్కిరెడ్డిపల్లె ఎస్సీ హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్

June 30, 2026 | Andhra Pradesh

లక్కిరెడ్డిపల్లె ముచ్చట్లు:

లక్కిరెడ్డిపల్లె మండలంలోని ఎస్సీ-1, ఎస్సీ-2 వసతిగృహాల వార్డెన్ మనోహర్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సాంఘిక సంక్షేమ డివిజనల్ అధికారి కృష్ణయ్య తెలిపారు. వారం రోజుల క్రితం కొందరు విద్యార్థులకు సకాలంలో భోజనం అందించకుండా దుర్భాషలాడినట్లు ఫిర్యాదులు రావడంతో పాటు, తహసీల్దార్ క్రాంతికుమార్, ఎంపీడీవో రెడ్డెయ్య తనిఖీకి వెళ్లిన సమయంలో వార్డెన్ విధుల్లో లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. వారి నివేదిక ఆధారంగా సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తాత్కాలికంగా లక్కిరెడ్డిపల్లె ఎస్సీ బాలికల వసతిగృహ వార్డెన్ సావిత్రికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు.

Tags:Suspension of Lakkireddypalle SC Hostel Warden