- ఇంటికి తాళం వేసి భార్య, ప్రియుడిని బంధించిన భవన కార్మికుడు
- ‘ప్రియుడిని మాత్రం వదలను’ అంటూ తెగేసి చెప్పిన భార్య
- ప్రియుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు
మదనపల్లె టౌన్ ముచ్చట్లు:
భర్త కష్టపడి పనికి వెళ్తే.. భార్య మాత్రం ప్రియుడితో ఇంట్లో రాసలీలలు సాగించింది. చివరికి అనుమానం వచ్చిన భర్త పక్కా స్కెచ్ వేసి ఇద్దరినీ ఇంట్లోనే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, ఇంటికి తాళం వేసి పోలీసులకు సమాచారం అందించిన ఘటన ఆదివారం మదనపల్లె మండలంలో కలకలం రేపింది.
పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని ఈశ్వరమ్మ కాలనీలో నివాసముంటున్న ఓ భవన కార్మికుడికి, అతడి భార్యకు కొంతకాలంగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆమె ఓ డిష్ కార్యాలయంలో బిల్ కలెక్టర్‌గా పనిచేసే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం. భర్త ఇంట్లో లేని సమయంలో అతడిని తరచూ ఇంటికి రప్పించుకునేదని స్థానికులు చెబుతున్నారు.
ఆదివారం కూడా భర్త పనికి వెళ్లాడనుకుని భార్య తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. అయితే ముందుగానే అనుమానం వచ్చిన భర్త ఇంటి వద్ద నిఘా పెట్టి, సరైన సమయంలో ఇంట్లోకి వెళ్లి ఇద్దరినీ ఒకే గదిలో గుర్తించాడు. వెంటనే బయట నుంచి గడియ పెట్టి, ఇంటికి తాళం వేసి పోలీసులకు సమాచారం అందించాడు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా భార్య, “కావాలంటే నా భర్తను వదిలేస్తాను కానీ, నా ప్రియుడిని మాత్రం వదలను” అని చెప్పినట్లు స్థానికులు పేర్కొన్నారు. దీంతో ఆగ్రహించిన భర్త, స్థానికులు కలిసి యువకుడిపై దాడి చేసినట్లు సమాచారం. అనంతరం ఇద్దరినీ పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Tags; Cunning wife caught red-handed in husband’s trap.