June 29, 2026
Explore
కన్నతల్లి ప్రేమ ముందు…ఏది సాటి రాదు..సాటి లేదు

కన్నతల్లి ప్రేమ ముందు…ఏది సాటి రాదు..సాటి లేదు

June 29, 2026 | Andhra Pradesh

….కానీ ఈ రోజుల్లో శారీరక సుఖం కోసం.. ప్రియుడు మోజు లో పడి నవమాసాలు మోసిన బిడ్డల ప్రాణాలు తీస్తున్న కొందరు అమ్మలు అయితే….వీళ్ళ వలన అమ్మ అనే పదం కి మచ్చ తెచ్చేవారు కొందరు అయితే…. ప్రాణాలకు తెగించి బిడ్డలను కాపాడుకునే మాతృమూర్తిలు ఎందరో….ఇలాంటి వీడియో లు చూస్తున్నప్పుడు తెలుస్తోంది …అమ్మ విలువ!

అమరావతిముచ్చట్లు:

తన పిల్లలు ఆపదలో ఉన్నారంటే ఏ తల్లి ఊరుకోదు.

ఆ సమయంలో ఆమె ఓ యోధురాలిలా పోరాడుతుంది.

తన ప్రాణాలను సైతం అడ్డుపెట్టి పిల్లలను కాపాడుకుంటుంది.

తాజాగా ఇలాంటి ఘటనకు సమబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఇటీవల వెనిజులాలో భారీ భూకంపం సంభవించగా ఓ ఇళ్లు ఊగిపోయింది.

ఆ సమయంలో బెడ్‌పై ఉన్న పిల్లాడిని రక్షించేందుకు ప్రెగ్నెంట్ గా ఉండి కూడా ప్రాణాలకు తెగించి బిడ్డ ప్రాణాలు కాపాడింది.

తనకేమైనా ఫర్వాలేదని పరుగున వచ్చి బిడ్డపై పడుకొని రక్షణ కల్పించారు.

ఈ వీడియో SMలో వైరలవుతోంది.

ఇలాంటి అమ్మలకు…పాదాభివందనం

Tags: Nothing compares to a mother’s love—it is truly matchless.