June 28, 2026
Explore
వినుకొండలో గుర్తుతెలియని యువకుడు మృతి

వినుకొండలో గుర్తుతెలియని యువకుడు మృతి

June 28, 2026 | Andhra Pradesh

పల్నాడు ముచ్చట్లు:

వినుకొండ పట్టణంలో అనారోగ్యంతో అపస్మారక స్థితిలో కనిపించిన గుర్తుతెలియని యువకుడిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ ఆదివారం అతను మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని, అతని ఆచూకీ తెలిసిన వారు లేదా బంధువులు ఎవరైనా ఉంటే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

Tags: Unidentified young man dies in Vinukonda