పుంగనూరుముచ్చట్లు:
శని త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం పట్టణంలోని యాబైరాళ్ల మొరవ, రాగానిపల్లె రోడ్డులో గల శ్రీ శనేశ్వరస్వామి ఆలయాలలో వైభవంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివార్లను ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయాలకు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. పూజల అనంతరం అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
Tags: Special prayers to Lord Shaneshwara