ఓటర్ల నమోదు పక్రియలో బి ఎల్ ఏ లు కీలకం..
ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే..
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు ఉండేలా బి ఎల్ ఏ లు ప్రత్యేక చొరవ చూపాలి…
లక్కిరెడ్డిపల్లె ముచ్చట్లు:
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR 2026)పై లక్కిరెడ్డిపల్లె, గాలివీడు మండలాల వైఎస్ఆర్ సిపి బూత్ లెవల్ ఏజెంట్ల (బి ఎల్ ఏ) శిక్షణ సమావేశంలో దిశ, నిర్దేశం చేసిన ఎంపీ మిథున్ రెడ్డి, వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, హిందూపురం పరిశీలకులు రమేష్ కుమార్ రెడ్డి, ఎం ఎల్ సి కల్పలతా రెడ్డి ఓటర్ల నమోదు పక్రియలో బి ఎల్ ఏ లు కీలకమని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి,
వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి, హిందూపురం పరిశీలకులు రమేష్ కుమార్ రెడ్డి, ఎం ఎల్ సి కల్పలతా రెడ్డి అన్నారు.లక్కిరెడ్డిపల్లె, గాలివీడు, వైఎస్సార్‌సీపీ బూత్ లెవల్ ఏజెంట్స్ (BLA) సమావేశం ఎంపిపి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన అధ్యక్షతన శనివారం లక్కిరెడ్డిపల్లె లో నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ – SIR 2026 ప్రక్రియపై సమగ్ర అవగాహన కల్పించడంతో పాటు, చేపట్టాల్సిన కార్యాచరణ, అనుసరించాల్సిన మార్గదర్శకాలు మరియు బూత్ స్థాయి బలోపేతంపై విస్తృతంగా చర్చించారు.
ఓటు హక్కు రక్షణకు బి ఎల్ ఏ లే ముందుండాలి: ఎంపీ మిథున్ రెడ్డి
ఓటును ఏ ఒక్కరూ నిర్లక్ష్యం చేయొద్దని ఎంపీ పెదిరెడ్డి మిథున్ రెడ్డి అన్నారు.ప్రతి ఓటు కీలకమైనదన్నారు. ఓటర్ల ప్రత్యేక సవరణ పక్రియ (సర్) లో బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) ల పాత్ర కీలకమైనదన్నారు.రాయచోటి నియోజక వర్గంలో 292 బూత్ లలో బి ఎల్ ఏ లు సైనికుల్లా పనిచేయాలన్నారు.అర్హులు ఓట్ల జాబితాలో ఉండేలా నిబద్ధతతో పని చేయాలన్నారు.ప్రతి బూత్ లోని ఓట్లర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఓటర్ల చేర్పులు,మార్పులలో అభ్యంతరాలు ఉంటే తక్షణమే నిబంధనల ప్రకారం సంబంధిత బూత్ లెవల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. అర్హుల ఓటు తొలగింపు జరగకుండా,అనర్హుల పేర్లు చేర్పులు జరగకుండా చూడాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యతలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల కమీషన్ విడుదల చేసిన ఫారం6, 7 తో పాటు ఇతర అంశాలను , జాబితాలో ఇతర అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. ఓటు కోల్పోతే సంక్షేమ పథకాలు కూడా ఇవ్వము అని చెప్పే పరిస్తితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు.స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. తాను ఎంపీ గా మరోసారి గెలవడానికి రాయచోటే మొదటిగా నిలుస్తుందన్నారు.
అర్హుల ఓటే లక్ష్యం..
బి ఎల్ ఏ లు మరింత బాధ్యతగా పనిచేయాలి.. శ్రీకాంత్ రెడ్డిదిశ నిర్దేశం
బి ఎల్ ఏ లు మరింత బాధ్యతగా పనిచేయాలని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.SIR జరిగిన రాష్ట్రాలలో ఉత్తర ప్రదేశ్ లో 2.89 కోట్లు, మధ్యప్రదేశ్ 34 లక్షలు, గుజరాత్ 68 లక్షలు, తమిళనాడు 74 లక్షలు, పశ్చిమ బెంగాల్ 91 లక్షలు ఓట్లు తొలగించ బడ్డాయన్నారు.దీన్ని బట్టి మనం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.ఓటర్ల తుది జాబితా వచ్చేంతవరకూ సైనికుల్లా పనిచేయాలన్నారు.
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది…
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలనను కొనసాగిస్తోందన్నారు. వైఎస్ జగన్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారే కానీ అభివృద్ధి, ప్రజా సమస్యలపై దృష్టి సారించడం లేదన్నారు. అక్రమ కేసులు పెడుతున్నారన్నారు.మనిషిని చంపేసినా, బూడిద ఇవ్వమని ఆ వ్యక్తి తల్లి రోధిస్తున్నా ఇవ్వక క్షోభకు గురిచేయడం ఏంటని ఆయన ప్రశించారు.రెండేళ్ల పాలన లో వారు చెప్పుకునేదానికి ఏ సంక్షేమ, అభివృద్ధి పథకం లేవన్నారు.ఒక్క కొత్త పెన్షన్ కానీ, ఒక్క కొత్త ఇల్లు కానీ మంజూరు చేయలేదన్నారు.జిల్లా కేంద్రముగా ఉన్న రాయచోటిని తీసేసి, ఈ ప్రాంత ప్రజల కలలను చిదిమివేశారని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికలలో ఇచ్చిన హానీలను నెరవేర్చడం లేదన్నారు.నెలకు మహిళలకు 1500 ఇస్తామన్న హామీ ఏమైందన్నారు.45 ఏళ్ల వయస్సు గల ఎస్ సి,ఎస్ టి,బిసి ,మైనారిటీ లకు పెన్షన్ల ఇచ్చే హామీకి దిక్కు లేదన్నారు.విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వడం లేదన్నారు.రైతు భరోసాను మొదటి ఏడాది ఎగురకొట్టారని ఆయన ధ్వజమెత్తారు.
కార్యకర్తలకు ఎల్లవేళలా తోడుంటా…
నియోజక వర్గ పరిధిలోని వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు, నాయకులకు ఏ కష్టం వచ్చినా తోడుగా, అండగా ఉంటామని శ్రీకాంత్ రెడ్డి భరోసా నిచ్చారు. గత జగన్ ప్రభుత్వ పాలన ను, ఇప్పటి కూటమి ప్రభుత్వ పాలన ను బేరీజు వేసుకుని ప్రజలకు వివరించాలన్నారు.ఓటర్ల చేర్పులు, మార్పులు, తొలగింపులలో మన వారికి అన్యాయం జరిగేటట్లు ఉన్నట్లయితే అధికారుల దృష్టికి తీసుకుపోవడంతో పాటు పార్టీ లీగల్ టీం దృష్టికి తీసుకువెల్తామన్నారు.
అపర భగీరదుడిలా ఎంపీ మిథున్ రెడ్డి
రాయచోటి నియోజకవర్గంలో గత పన్నేండ్ల నుండి త్రాగునీటి పథకాలుకు,ఇతర అభివృద్ధి పనులకు అత్యధికంగా ఎంపీ మిథున్ రెడ్డి నిధులు ఇచ్చి అపర భగీరధుడిగా నిలిచారని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.
దుర్మార్గపు పాలనను సాగనంపాలి…రమేష్ కుమార్ రెడ్డి
కూటమి ప్రభుత్వ దుర్మార్గపు పాలనను సాగనంపాలని
రమేష్ కుమార్ రెడ్డి అన్నారు.
అర్హులైన వైఎస్ఆర్ సిపి మద్దతు దారుల ఓట్లును పోగొట్టుకోకుండా చూడాలని కోరారు. మైనారిటీ ఓట్లను ఎక్కువగా తీస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయన్నారు.పార్టీ అనుబంధ సంఘాలతో బి ఎల్ ఏ లు సమన్వయం చేసుకుని పార్టీ మద్దతు దారుల ఓట్లను పోగొట్టుకోకుండా కృషి చేయాలన్నారు.
సైనికుల్లా పనిచేయాలి: ఎం ఎల్ సి కల్పలత రెడ్డి
వైఎస్ఆర్ సిపి బిఎల్ఏ లు సైనికుల్లా పనిచేయాలని ఎం ఎల్ సి కల్పలత రెడ్డి కోరారు.SSR స్పెషల్ సమ్మరీ రివిజన్,SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ల గురించి విపులంగా వివరించారు.SIR లో రెండు పేజ్ లు ప్రీ ఎన్యూమరేషన్,ఎన్యూమ రేషన్ లు ఉంటాయన్నారు.ప్రీ ఎన్యూమరేషన్ లో BLO 2025 ఓటరు జాబితా ను 2002 ఓటరు జాబితా తో మ్యాపింగ్ (అనుసంధానం) చేస్తారన్నారు. ఎన్యూమరేషన్ లో 2002 జాబితాతో మ్యాపింగ్ అయిన వారికి పారం వివరాలతో pre _filledగా వస్తుందని,వారు కేవలం ఫోటో అంటించి సంతకం చేసి బి ఎల్ ఓ కు ఇవ్వాలన్నారు.మ్యాపింగ్ కాని వారికి వారు ఎన్యూమరేషన్ పారం లో వివరాలు నింపి,బంధుత్వ ఆధారాలు మరియు అవసరమైన పత్రాలు సమర్పించాలన్నారు. మ్యాపింగ్ నిరూపించుకోలేని వారు ప్రభుత్వం నిర్దేశించిన 13 పత్రాలలో ఏవైనా రెండింటిని సమర్పించాలన్నారు.బి ఎల్ ఏ మరియు స్థానిక నాయకులు ప్రతి ఇంటినీ సందర్శించి, ఓటర్లందదినీ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తో పాటు గుర్తింపు కార్డు ను రెడీ గా పెట్టుకోమని చెప్పాలని సూచించారు.
ఓటరు అందుబాటులో లేకపోయినా కుటుంభ సభ్యులు లేదా బి ఎల్ ఏ ఆధారాలు సేకరించి పారం నింపాలన్నారు.బి ఎల్ ఏ రోజుకు 50 ఎన్యూమ రేషన్ పారాలు సమర్పించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలోగాలివీడు మండల కన్వీనర్ మిట్టపల్లె యదుభూషన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల నాగభూషణ్ రెడ్డి,మండల వైస్ ప్రెసిడెంట్ సమర్సింహా రెడ్డి,మాజీ వైస్ ఏంపిపి రమేష్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాలాడి ప్రభాకర్ రెడ్డి,మండల మైనార్టీ నాయకులు, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ అమీర్, మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ యర్రంరెడ్డి,మాజీ మండల వైస్ ప్రెసిడెంట్ సిద్దక రామచంద్ర రెడ్డి , ఎంపీటీసీలు దస్తగిరి, జగన్ మోహన్ రెడ్డి, లక్ష్మీనారాయణ,శంకర్ నాయుడు, సుబ్బరాయుడు, గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్ సామాల నరసింహారెడ్డి, వైయస్సార్సీపి దప్పేపల్లి యువ నాయకులు పాపిరెడ్డి సిద్దారెడ్డి, ఉప సర్పంచ్ లు రాజారెడ్డి, సంజీవ రెడ్డి, రాజబాబు,మాజీ సర్పంచ్ లు రమణయ్య, సిద్దక నాగిరెడ్డి, జనార్దన్ రెడ్డి, గడ్డం ప్రభాకర్ రెడ్డి, దుర్గయ్య,వెంకటరమణ, దుర్గయ్య, మహేంద్ర బాబు,
మాజీ ఎంపిటిసి రామ్మోహన్ శెట్టి,వాటర్ షెడ్ చైర్మన్ తోపిరెడ్డి మల్ రెడ్డి, లక్కిరెడ్డిపల్లి మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు బాబ్జన్,మైనార్టీ నాయకులు చాన్ భాష, జాకీర్, ఖాజా, అలిభాష, జమాల్ బాషా, ఇర్షద్,దుబాయ్, రఫీ, సాహెబ్ , అబ్దుల్ నబీ, వైయస్సార్సీపి నాయకులు లల్లూ యాదవ్, సభపాతి నాయుడు,ఢిల్లీ విశ్వనాథరెడ్డి, లక్ష్మిరెడ్డి,బండ్రేడ్డి శంకర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, దప్పేపల్లి రంగారెడ్డి, వరప్రసాద్ రెడ్డి, మద్దిరేవుల రాఘవ రెడ్డి, కొండారెడ్డి, సభపతి నాయుడు, దప్పేపల్లి ప్రసాద్ రెడ్డి, దాప్పేపల్లి శ్రీధర్ రెడ్డి, కొండా ఓబుల్ రెడ్డి, గుడ్లవారిపల్లి లక్ష్మీరెడ్డి,చెన్నారెడ్డి, రఘునాధ రెడ్డి, మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ ఓబులేసు, మాజీ డీలర్ మోహన్ కుమార్, నాగార్జున, లక్కిరెడ్డిపల్లి వైఎస్సార్సీపి యూత్ అధ్యక్షులు కోదండ జగన్నాద నాయుడు, జగన్ మోహన్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి,వెంకటరమణ రెడ్డి,కొనంపేట రామాంజులు రెడ్డి, తోపిరెడ్డి గోపాల్ రెడ్డి,సూర్యనారాయణ రెడ్డి, పక్కిరారెడ్డి, చిన్న వెంకటరమణ,చెన్నకేశవ రెడ్డి (బాబు), నారద,మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ రమణ, ఈడిగపల్లి సుబ్బారాయుడు, దిలీప్ రాజు, సుదర్శన్ రాజు,ధవాళేశ్వర్, చంద్రశేఖర్,పురుషోత్తం, మల్లేష్ నాయుడు, పూటకాలపల్లి రమణ, ఉప్పు శ్రీను, చౌటపల్లి గంగరాజు, మట్లి రెడ్డెయ్య,దియ్యల నరసింహారెడ్డి,పాలేం బాబు రెడ్డి, నాగముని రెడ్డి,మాజీ డీలర్ శివమళ్లప్ప నాయుడు,పురుషోత్తం,రామయ్య,, ధర్మారెడ్డి, భాను,సుబ్బయ్య,శేఖర్, నరసింహులు, పద్మనాభం,రమణ, శ్రీను, రవి, ఆంజనేయులు,నాగరాజా,జయరామ, మళ్ళీ, నాగులు, నారాయణ,రాజేష్,చిన్నప్ప, వీరనాగయ్య, నాగేంద్ర,రమణ,మండలంలోని వైఎస్ఆర్ సీపీ నాయకులు,కార్యకర్తలు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



Tags:Protect every vote… work like soldiers…