పూతలపట్టు ముచ్చట్లు:
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ని ఉద్దేశించి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీ చేసిన అవమానకర, అసభ్య మరియు విద్వేషపూరిత వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవలసినదిగా పూతలపట్టు నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ అదేశాల మేరకు బంగారుపాళ్యం
అప్ గ్రేడ్ పోలీస్ స్టేషన్ సిఐ కత్తి శ్రీనివాసులు కి రాష్ట్ర పాల ఏకరి విభాగం అధ్యక్షులు ఎం.బి.కుమార్ రాజా
ఫిర్యాదు అందజేశారు.తేదీ 21.06.2026న కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీ నిర్వహించిన ఒక ప్రెస్ మీట్ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ని ఉద్దేశించి అత్యంత అసభ్యకరమైన, కించపరిచే మరియు రెచ్చగొట్టే విధమైన వ్యాఖ్యలు చేసిన విషయం నా దృష్టికి వచ్చింది.
సదరు సమావేశంలో ఆయన “జగన్ గాడికి దమ్ముంటే నానాజీ మీద పోటీ చేయమనండి”, “జగన్ని కాకినాడ రూరల్‌లో పోటీ చేయమనండి”, “కడప జిల్లా వదిలి ఇక్కడకు వచ్చి పోటీ చేయమనండి” తదితర వ్యాఖ్యలు చేయడమే కాకుండా, వ్యక్తిగతంగా అవమానించే పదజాలాన్ని ఉపయోగించారు. ఈ వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శల పరిమితిని దాటి, ఒక రాజకీయ నాయకుడి గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉండటమే కాకుండా, ఆయనను అభిమానించే లక్షలాది మంది ప్రజల మనోభావాలను కూడా తీవ్రంగా దెబ్బతీశాయి.అంతేకాకుండా, ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు మరియు వార్తా కథనాలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ మరియు ఇతర సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేయబడుతున్నాయి. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఈ వీడియోలను షేర్ చేస్తూ ప్రజల మధ్య రాజకీయ విద్వేషాలను, కులపరమైన మరియు ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితి రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్నది.
నేను ఈ వీడియోలను సామాజిక మాధ్యమాలలో చూసిన తరువాత అనేక మంది ప్రజలు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ నన్ను సంప్రదించారు. సదరు వ్యాఖ్యలు ప్రజల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించి, రాజకీయ ఉద్రిక్తతలను సృష్టించే స్వభావం కలిగినవిగా కనిపిస్తున్నాయి.కావున, తమరు ఈ ఫిర్యాదును స్వీకరించి, పై ఘటనపై సమగ్ర విచారణ జరిపి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీ గారితో పాటు ఈ వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేసి విద్వేషాలను రెచ్చగొట్టిన వ్యక్తులను గుర్తించి, వారి మీద సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవలసిందిగా వినయపూర్వకంగా ప్రార్థించుచున్నాను.
ఈ కార్యక్రమం లో మండల విప్ హేమచంద్ర,రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి,జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శలు మునేంద్ర,సుబ్రమణ్యం,జిల్లా ట్రేడ్ యునియన్ కార్యదర్శి రఘుపతి రాజు,జిల్లా మాజీ యువజన విభాగం ఉపాద్యక్షుడు మహేంద్ర, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగరాజా, మండల యువజన విభాగం అధ్యక్షులు గజేంద్ర,మండల మాజీ యువజన విభాగం అధ్యక్షులు జగదీష్,మండల బుత్ కమిటీ కో ఆర్డినేటర్ తగ్గువారిపల్లి జగదీష్, మండల సోషల్ మీడియా అధ్యక్షుడు శైలేష్ బాబు, ముబారక్, నాయకులు,కుమారస్వామి, ప్రదీప్,మణి,కార్తిక్,బద్రి,వినోద్,
తదితరులుపాల్గొన్నారు.
Tags: