పార్వతీపురం ముచ్చట్లు:
పట్టణంలో1400 గ్రాముల గంజాయి స్వాధీనం, ఇరువురు ఇంజనీరింగ్ విద్యార్థులు ,ముగ్గురు యువకులు అరెస్ట్ .
మొదటి పట్టణ పోలీసులు పట్టణంలోని ప్రకాష్ నగర్ అంధుల ఉన్నత పాఠశాల వద్ద శనివారం మధ్యాహ్నం 1400 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇరువురు బీటెక్ విద్యార్థులు, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు మొదటి పట్టణ సిఐ ఫిరోజ్ తెలిపారు. మండల పరిధిలోని ఒక కళాశాలలో మూడో సంవత్సరం బీటెక్ చదువుతున్న మన్యం జిల్లా పార్వతీపురం కు చెందిన సింహాచలం అలియాస్ వినోద్ గంజాయిని తీసుకొచ్చి మండలంలోని మరో కళాశాలలో మూడో సంవత్సరం బీటెక్ చదువుతున్న కృష్ణా జిల్లాకు చెందిన సాయినాథ్కు విక్రయిస్తుండేవాడు. ఈ నేపద్యంలో సింహాచలం కు ఇన్స్టలో గుంటూరుకు చెందిన జావేద్, రహంతుల్లా,అతావుల్లాలు పరిచయమయ్యారు. ఈ ముగ్గురు కూడా సింహాచలం వద్ద నుండి గంజాయి కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. గంజాయి కొనుగోలు కోసం సింహాచలం వద్దకు పై నలుగురు రాగా ముందస్తు సమాచారంతో పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 1400 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు సీఐ ఫిరోజ్ తెలిపారు.
Tags: Three engineering students arrested.