June 27, 2026
Explore
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై విస్తృత స్థాయి అవగాహన సమావేశం

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై విస్తృత స్థాయి అవగాహన సమావేశం

June 27, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా రాయచోటి నియోజకవర్గంలోని పీ.జీ.ఆర్ ఫంక్షన్ హాల్, లక్కిరెడ్డిపల్లెలో గాలివీడు, లక్కిరెడ్డిపల్లి మండలాలకు సంబంధించిన సమగ్ర ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై విస్తృత స్థాయి అవగాహన సమావేశం ఘనంగా నిర్వహించబడింది.

ఈ సమావేశానికి రాజంపేట పార్లమెంట్ సభ్యులు, యువనేత పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు అని పేర్కొన్నారు.

అలాగే, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగుతోందని విమర్శించారు. రాయచోటి ప్రజల ప్రేమాభిమానాలకు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొంటూ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ లెవల్ ఏజెంట్లు (BLAs) అందరూ సమన్వయంతో పనిచేసి ఒక్క అర్హుడైన ఓటరు కూడా జాబితా నుంచి మినహాయించబడకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు.

కావున అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని సూచించారు. ఓటరు నమోదు, పేర్ల సవరణ, చిరునామా మార్పులు, అభ్యంతరాల పరిష్కారం వంటి అంశాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని, ప్రతి ఓటు ప్రజాస్వామ్యానికి బలమనే భావనతో బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి , లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కల్పతరెడ్డి , గాలివీడు, లక్కిరెడ్డిపల్లి మండలాల పార్టీ నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు (BLAs), ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, మండల మరియు గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.

Tags; Large-scale awareness meeting on the special revision process of the voter list.