June 27, 2026
Explore
ఎస్‌ఐఆర్‌ను పూర్తిగా జయప్రదం చేయండి

ఎస్‌ఐఆర్‌ను పూర్తిగా జయప్రదం చేయండి

June 27, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ఎస్‌ఐఆర్‌ (స్పెషల్‌ ఇన్‌టెన్సివ్‌ రివిజన్‌) కార్యక్రమం జూలై 14తో పూర్తి అవుతుందని , వైఎస్సార్‌సిపి శ్రేణులు ఈ కార్యక్రమాన్ని పకడ్భంధిగా జయప్రదం చేసేందుకు కృషి చేయాలని మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అలీమ్‌బాషా సూచించారు. శనివారం పట్టణంలోని పలు ప్రాంతాలలో ఎస్‌ఐఆర్‌ కార్యక్రమాన్ని జిల్లా వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్‌ అమ్ముతో కలసి ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎన్యూమరేషన్‌ ఫారాలు పంపిణీ చేశారు. బిఎల్‌వోలను అడిగి ఆగిపోయిన పంపిణీ కార్యక్రమంపై వివరాలు తెలుసుకున్నారు. అలీమ్‌బాషా మాట్లాడుతూ మున్సిపాలిటిలో ప్రతి వార్డులోను సుమారు 200 వరకు ఎన్యూమరేషన్‌ ఫారాలు పంపిణీ జరగాల్సి ఉందన్నారు. ప్రతి ఒక్కరు నిర్లక్షం చేయకుండ త్వరగా పూర్తి చేసి , పారదర్శకమైన ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బాషు, అజీజ్‌ ,హేము, నజీర్‌, బావాజాన్‌, సాహేబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags; Make SIR a resounding success.