June 27, 2026
Explore
మాజీ ప్రియురాలు హత్య

మాజీ ప్రియురాలు హత్య

June 27, 2026 | Andhra Pradesh

గుంటూరుముచ్చట్లు:

కేసు చేధించిన మంగళగిరి రూరల్.. దుగ్గిరాల పోలీసులు

కేసు యొక్క వివరాలు వెల్లడించిన గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్

దుగ్గిరాల పాత లాకుల వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమయింది…

మహిళ మెడపై గాయాలు ఉండటంతో హత్యా నేరం కింద కేసు నమోదు చేసాం..

మహిళ యొక్క వివరాలు కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశాం..

దర్యాప్తులో మృతురాలు తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గాజుల మాండ్యం ప్రాంతానికి చెందిన మీనాటి మేనకగా గుర్తించాం..

మృతురాలికి వెళ్ళబాడు గ్రామానికి చెందిన వల్లభాపురం చిరంజీవి అనే వ్యక్తితో రిలేషన్ లో ఉంది..

చిరంజీవికి ఈ మధ్యకాలంలో వేరే మహిళతో వివాహం జరిగింది..

ఈ విషయం తెలిసిన మేనక చిరంజీవితో పలుమార్లు గొడవ పడగా పెద్దలు సమక్షంలో 5 లక్షల రూపాయలు మూడు విడతల్లో నష్ట పరిహారం చెల్లించాలని చిరంజీవికి చెప్పారు..

మే 29వ తారీకు మొదటి విడత డబ్బులు తీసుకొనుటకు మేనక గుంటూరు వచ్చింది..

గుంటూరు వచ్చిన రోజు మేనక కు మరియు చిరంజీవికి గొడవ జరగడంతో చిరంజీవి పథకం ప్రకారం లాకుల వద్దకు తీసుకువెళ్లి మేనక గొంతు నులిమి హతమార్చాడు..

దర్యాప్తులో చిరంజీవి హత్య చేసినట్టుగా అంగీకరించడంతో అతన్ని రిమాండ్ కి తరలిస్తున్నాం…

Tags; Ex-girlfriend murdered