తిరువూరు ముచ్చట్లు:
పట్టణం లోని బైపాస్ శ్రీ సూర్య రెస్టారెంట్ సమీపంలోని…
నందన్ వైన్స్ లో కల్తీ మద్యం విక్రయాలు.
నాశిరకం మందు విక్రయాలు పట్ల వైన్స్ నిర్వాహకులతో గొడవలకు దిగుతున్న మందుబాబులు.
మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటూ బెదిరిస్తున్న నిర్వహకులు.
నాటు సారా విక్రయాలు పై చర్యలు, తప్పించి, ప్రభుత్వ మద్యం విషయంలో అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించటం ఏంటని ప్రశ్నిస్తున్న మందుబాబులు.
మామూళ్ళ మత్తు లో జోగుతున్న ఎక్సైజ్ శాఖ అధికారుల తీరు మందు బాబులకు శాపంగా మారిందని ఆరోపణలు.
పట్టణంలోని బార్ అండ్ రెస్టారెంట్ మరియు వైన్స్ షాపుల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారుల తీరు పట్ల మందు బాబుల ఆగ్రహం.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని మందు బాబులు కోరుతున్నారు.
Tags: Sale of adulterated liquor at Nandan Wines.