June 26, 2026
Explore
టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు

టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు

June 26, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె పట్టణంలోని టిట్కో ఇండ్ల సమీప చెరువులో గత రెండు రోజులుగా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ లేని టిప్పర్లు, జేసీబీలతో భారీ స్థాయిలో మట్టి తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ప్రశ్నించగా అధికారులేమీ చేయలేరంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆరోపించారు. చెరువు తవ్వకాలతో పర్యావరణానికి, వర్షాకాలంలో నీటి నిల్వ సామర్థ్యానికి నష్టం కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రెవెన్యూ, మైనింగ్, పోలీసు శాఖలు వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.

Tags: Allegations of illegal soil excavation from the lake near TITCO.