తిరుమల ముచ్చట్లు:
తిరుమల మొదటి ఘాట్రోడ్డులో శుక్రవారం కారు ప్రమాదానికి గురైంది. మహారాష్ట్రకు చెందిన భక్తులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడరు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులకు చికిత్స అందించారు. అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు.
Tags: Accident on the first Tirumala ghat road.