పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు పట్టణంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన శ్రీ అన్నపూర్ణా దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి ఆదివారం చతుర్థి సందర్భంగా వైభవంగా విశేష పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు వేద మంత్రోచారణల మధ్య రుద్ర మంత్రోచ్ఛారణలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి సువర్ణ కిరీటాన్ని ధరింపజేశారు. తరువాత మహా మంగళహారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి దర్శించుకున్నారు.
Tags: Kashi Visveswara grants darshan to devotees adorned in a golden crown.