March 22, 2026
Explore
గుర్తు తెలియని వ్యక్తి మృతి – ఎవరికైనా తెలుసా..?

గుర్తు తెలియని వ్యక్తి మృతి – ఎవరికైనా తెలుసా..?

March 22, 2026 | Andhra Pradesh

పీలేరు ముచ్చట్లు:

పీలేరు మండలం కామాటంపల్లె అంగన్వాడీ పాఠశాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది. పాదచారులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

మృతుడు సుమారు 50-55 సంవత్సరాల వయస్సు గల బిక్షాటకుడిగా గుర్తించారు. శరీరంపై ఎటువంటి గాయాల గుర్తులు కనిపించకపోవడంతో మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరుతున్నారు.

Tags:Unidentified Person Dies – Does Anyone Know Who They Are?