June 25, 2026
Explore
అంగళ్లు ఫ్లై ఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం గుర్తుతెలియని యువకుడు స్పాట్ డెడ్

అంగళ్లు ఫ్లై ఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం గుర్తుతెలియని యువకుడు స్పాట్ డెడ్

June 25, 2026 | Andhra Pradesh

తంబళ్లపల్లి ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లాల్లో రోడ్డు ప్రమాదం జరిగి యువకుడు మృత్యువాత పడ్డాడు. తంబళ్లపల్లి నియోజకవర్గం లోని, కురబలకోట మండలం, అంగళ్లు ఫ్లై ఓవర్ కింద ఉన్న చెరువు వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగి, బైకులో వస్తున్న యువకుడు మృత్యువాత పడ్డాడు. మృతుడి ద్విచక్ర వాహనం ఫ్లై ఓవర్ కిందనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లి చనిపోయి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న కురబలకోట108సిబ్బంది మృతిచెందాడని నిర్ధారించారు. సమాచారం అందుకున్న ముదివేడు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు ఎవరనేది ఇంకా తెలియరాలేదని చెప్పారు.

Tags; Road accident at Angallu flyover; unidentified young man dies on the spot.